News August 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 8, 2025

ఫ్యామిలీతో మాట్లాడేందుకు తహవ్వుర్ రాణాకు అనుమతి

image

26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాకు ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. అతడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రైవేట్ లాయర్‌ను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయవాది న్యాయ సహాయ సలహాదారుగా ఉన్నారు. అంతకుముందు ఫ్యామిలీతో మాట్లాడేందుకు రాణా చేసిన దరఖాస్తును తిహార్ జైలు అధికారులు వ్యతిరేకించారు.

News August 8, 2025

ఈ నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ.. కెప్టెన్లు వీరే

image

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2025 ఈ నెల 28 నుంచి బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్‌లో జరగనుంది. నార్త్ జోన్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, సెంట్రల్ జోన్‌కు ధ్రువ్ జురెల్, ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్, సౌత్ జోన్‌కు తిలక్ వర్మ, వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్లుగా నియమించారు. వీరిలో ఎవరైనా జాతీయ జట్టుకు ఆడాల్సి వస్తే ఆయా ప్లేయర్ల స్థానాలను వేరే ఆటగాళ్లతో భర్తీ చేస్తారు.

News August 8, 2025

HYDలో వర్షాలు.. అత్యవసర హెల్ప్‌లైన్లు ఇవే

image

హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రోడ్లను వరద ముంచెత్తుతోంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. వర్షం, వరద సమయంలో ఏదైనా సాయం అవసరమైతే సంప్రదించాలని సూచిస్తూ అధికారులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు. పైనున్న ఫొటోలో వివరాలు ఉన్నాయి.