News April 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 16, 2025

అనంతగిరి ఎంపీపీ పదవి నుంచి శెట్టి నీలవేణి తొలగింపు

image

అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిని ఎంపీపీ పదవి నుంచి తొలగిస్తూ సంబంధిత ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీపీ నీలవేణిపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో ప్రిసైడింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు అక్టోబరు 30న అనంతగిరిలో సమావేశం నిర్వహించారు. 11 మంది ఎంపీటీసీ సభ్యులు నీలవేణికి వ్యతిరేకంగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది.

News December 16, 2025

మోదీతో భేటీ అంశాలు లీక్.. కిషన్ రెడ్డి ఆగ్రహం

image

ప్రధాని మోదీతో తెలంగాణ BJP MPల సమావేశానికి <<18530988>>సంబంధించిన లీకులపై<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘PMతో భేటీ విషయాలను లీక్ చేసిన వ్యక్తులు మెంటల్ వాళ్లు. మీటింగ్‌ విషయాలు బయట చెప్పొద్దని PM చెప్పారు. అయినా వాటిని లీక్ చేశారు. వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు’ అని మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.

News December 16, 2025

ఎగ్జామ్ ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఫస్ట్, సెకండియర్ చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టింది. రూ.5వేల ఫైన్‌తో ఈ నెల 22 నుంచి JAN 5 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గత నెలలోనే గడువు ముగిసింది.