News August 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News April 13, 2026

భారత నౌకలకు టోల్ తీసుకోలేదు: ఇరాన్

image

హార్ముజ్ జలసంధి వద్ద ఇప్పటి వరకు భారత నౌకల నుంచి టోల్ వసూలు చేయలేదని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్‌ తమ మిత్రదేశమని పునరుద్ఘాటించింది. భారతీయ నౌకల భద్రత, ప్రయాణ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఇండియాలోని ఆ దేశ రాయబారి ఫతాలీ తెలిపారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. హార్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న US హెచ్చరికలను కొట్టిపారేస్తూ.. ‘వారికి మా సామర్థ్యం ఏంటో తెలుసు’ అని పేర్కొన్నారు.

News April 13, 2026

పాండ్య, డేవిడ్‌లకు ఫైన్

image

IPL: ముంబై కెప్టెన్ పాండ్య, ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు జరిమానా పడింది. నిన్నటి మ్యాచులో అంపైర్ సూచనలను <<19638355>>డేవిడ్<<>> పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అడిగినా బాల్ ఇవ్వలేదని IPL యాజమాన్యం పేర్కొంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినందుకు అతడి మ్యాచు ఫీజులో 25% కోత విధించినట్లు తెలిపింది. అటు స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసినట్లు వెల్లడించింది.

News April 13, 2026

12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA

image

AP: రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 44 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. మ.12 నుంచి సా.4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈరోజు కడపలో గరిష్ఠంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.