News August 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 24, 2025
మధ్యాహ్నం నిద్రపోతున్నారా: చాణక్య నీతి

మధ్యాహ్నం నిద్ర మేలు కాదని చాణక్య నీతి చెబుతోంది. దీంతో ఇతరుల కంటే పని తక్కువగా చేయడమే కాకుండా సమయం వృథా అవుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు మాత్రమే నిద్ర పోవాలని అంటోంది. మధ్యాహ్నం నిద్రతో జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. పవర్ న్యాప్(10-15 నిమిషాల నిద్ర)కు ఇది మినహాయింపు.
<<-se>>#chanakyaneeti<<>>
News August 24, 2025
యూఎస్ ఓపెన్.. ఎవరు సొంతం చేసుకుంటారో?

నేటి నుంచి యూఎస్ ఓపెన్(టెన్నిస్) మొదలు కానుంది. పురుషుల సింగిల్స్‌లో 25వ టైటిల్‌పై కన్నేసిన సీనియర్ ప్లేయర్ జకోవిచ్ వరుస పరాజయాలకు తెరదించుతారో చూడాలి. చివరి 3 టోర్నీల్లో సెమీస్‌లోనే జకో ఇంటిదారి పట్టారు. అటు యువ ప్లేయర్లు సిన్నర్, అల్కరాజ్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సబలెంకా, స్వైటెక్, కోకో గాఫ్ మధ్య పోరు నెలకొంది. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ కూడా బరిలో ఉన్నారు.
News August 24, 2025
ఇవాళ సురవరం అంతిమయాత్ర..

TG: సీపీఐ సీనియర్ నేత <<17490970>>సురవరం<<>> సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్‌లోని మఖ్ధూం భవన్(CPI ఆఫీసు)కు తరలించనున్నారు. ఉ.10-మ.3 గంటల వరకు ప్రజా సందర్శనకు ఉంచుతారు. CM రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర నేతలు నివాళి అర్పించనున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధన కోసం భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.