News August 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 25, 2025

నచ్చినచోట ఆయిల్ కొంటాం: భారత్

image

ఇండియన్ గూడ్స్‌పై US టారిఫ్స్ ఆంక్షల నేపథ్యంలో రష్యాలోని భారత అంబాసిడర్ వినయ్ కుమార్ ఫైరయ్యారు. ‘మార్కెట్లో బెస్ట్ డీల్ ఎక్కడుంటే అక్కడే భారత్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తుంది. US నిర్ణయం అసమంజసం. ఇది ఫెయిర్ ట్రేడ్ రూల్స్‌ను అణచివేయడమే. 140 కోట్ల భారతీయుల అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యమిస్తాం. రష్యాతో పాటు పలు దేశాలతో భారత సహాయ సహకారాల వల్లే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరపడింది’ అని స్పష్టం చేశారు.

News August 25, 2025

OT డ్యూటీలతో ఆరోగ్యంపై ప్రభావం: సర్వే

image

ఉద్యోగుల్లో ఓవర్ టైమ్(OT) వర్క్ చేయడంపై వ్యతిరేకత ఉందని జీనియస్ HR టెక్ సర్వేలో తేలింది. అదనపు ప్రయోజనాలు లేకుండా వర్కింగ్ అవర్స్‌ను పొడిగించడాన్ని మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించినట్లు పేర్కొంది. ఓవర్ టైమ్ డ్యూటీలతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని 44% మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. తగిన బెనిఫిట్స్ ఉంటే OT చేసేందుకు ఇబ్బందేమీ లేదని 40శాతం చెప్పినట్లు వెల్లడించింది.

News August 25, 2025

భారత్‌పై కావాలనే టారిఫ్స్ పెంచారు: వాన్స్

image

రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ కావాలనే భారత్‌పై టారిఫ్స్ విధించారని US వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ తెలిపారు. ‘ఆయిల్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపి రష్యన్స్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే INDపై సెకండరీ టారిఫ్స్ విధించారు. రష్యా హత్యలను ఆపకపోతే ఏకాకిగానే మిగిలిపోతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే కొత్తగా ఆంక్షలు విధించకుండా రష్యాపై ఎలా ఒత్తిడి తెస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.