News August 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 26, 2025

ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీల్లో ఛాన్స్.. శ్రీలీల ఏమన్నారంటే?

image

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డై అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది.

News August 26, 2025

గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.

News August 26, 2025

ఆ మ్యాచుల ఫలితం మార్చాలనుకుంటా: ద్రవిడ్

image

టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాజీ కోచ్ ద్రవిడ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే తాను ఆడిన ఓ 2 మ్యాచుల ఫలితాలు మార్చాలని ఉందన్నారు. టెస్టుల్లో 1997లో వెస్టిండీస్‌తో బార్బడోస్‌ టెస్ట్‌లో పరాజయం, 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి రిజల్ట్స్‌ను మార్చాలని కోరుకుంటానని అభిప్రాయపడ్డారు. ప్లేయర్‌గా ద్రవిడ్‌కు WC కలగానే మిగిలినా కోచ్‌గా 2024 టీ20 వరల్డ్ కప్ అందుకున్నారు.