News September 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News September 3, 2025
ఆ 3 బ్యారేజీల కథ ముగిసినట్లేనా?

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని సీఎం <<17595200>>రేవంత్<<>> ప్రకటించడంతో కాళేశ్వరంలోని 3 బ్యారేజీల కథ ముగిసినట్లేననే తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోగా, అన్నారం, సుందిళ్లకు సైతం ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆ 3 బ్యారేజీలతో పని లేకుండా ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టి ఎల్లంపల్లికి నీటిని తరలించనుంది. మధ్యలో ఒక లిఫ్ట్ చాలని, గ్రావిటీతో నీళ్లు వస్తాయని సర్కార్ తెలిపింది.
News September 3, 2025
జారిపడిన ప్రయాణికుడి కోసం వెనక్కెళ్లిన రైలు

AP: ప్రయాణికుడి కోసం రైలు వెనక్కెళ్లిన అరుదైన ఘటన ప్రకాశం(D) మార్కాపురంలో జరిగింది. గుంటూరు(D) బ్రాహ్మణ కోడూరుకు చెందిన హరిబాబు(35) రాత్రి సమయంలో రైలు కుదుపులకు లోనవ్వడంతో కిందపడిపోయాడు. సహచరులు వెంటనే చైన్ లాగి రైలు ఆపారు. లోకో పైలట్లు అధికారుల అనుమతితో రైలును 1.5KM వెనక్కి తీసుకెళ్లారు. అతడిని బోగీలోకి ఎక్కించి మార్కాపురంలో దింపారు. ఆస్పత్రికి తరలించినా హరిబాబు పరిస్థితి విషమించి మరణించాడు.
News September 3, 2025
బిగ్‌బాష్‌లో ఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్!

IPLకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లీగ్ బిగ్‌బాష్‌లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే AUS క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బిగ్‌బాష్‌లో ఆడే తొలి సీనియర్ ఇండియన్ క్రికెటర్‌గా అశ్విన్ నిలవనున్నారు. డిసెంబర్ 15 నుంచి లీగ్ ప్రారంభం కానుంది.