News September 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News September 5, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే!

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద PM ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈనెల 9 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.
News September 5, 2025
నేడు విశాఖ, విజయవాడలో పర్యటించనున్న CM

AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ నగరానికి చేరుకుని అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు.
News September 5, 2025
వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 50 వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.