News September 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 8, 2025

భారీగా పడిపోయిన ఉల్లి ధరలు!

image

ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. TGలో కిలోకు రూ.5-16 మాత్రమే దక్కుతోంది. వినియోగదారులకు మాత్రం రూ.25-45 మధ్య లభిస్తోంది. ఫలితంగా మధ్యవర్తులే లాభపడుతున్నారు. APలో క్వింటా కనిష్ఠంగా రూ.501, గరిష్ఠంగా రూ.1,249 పలుకుతోంది. రైతుకు కేజీకి రూ.5-12 మధ్యే దక్కుతోంది. కొన్ని మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లూ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News September 8, 2025

ఏపీలో BPCL ప్రాజెక్టు.. ToR ప్రిపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 9 MMTPA గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ&పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(ToR) ప్రిపరేషన్‌కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. నెల్లూరు(D) చేవూరులో ₹1.03లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పబ్లిక్ హియరింగ్ నిర్వహించి, ఇతర వివరాలతో నివేదిక సమర్పించాలని BPCLకు నిపుణుల అంచనా కమిటీ సూచించింది.

News September 8, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TGలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు APలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.