News May 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 2, 2026

అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య: పోలీసులు

image

AP: అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ‘అంబటిపై 16 కేసులు ఉన్నాయి. సీఎం చంద్రబాబును అసభ్యంగా దూషించారు. పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేయకపోతే అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అంబటిని 14 రోజులపాటు రిమాండ్ ఇవ్వాలి. లేదంటే ఆయనకు ప్రాణహాని ఉంది’ అని పేర్కొన్నారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.

News February 2, 2026

ఇది డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ ప్రభుత్వం: KTR

image

TG: కేంద్రంతో పోరాడి నిధులు సాధించడంలో INC ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే KCRను సిట్ విచారణకు పిలిచి నాటకాలు చేశారన్నారు. ‘ఇది డైవర్షన్, సబ్‌వర్షన్, పర్వర్షన్ ప్రభుత్వం. CM రేవంత్ గాలి మాటలు మాట్లాడుతూ గాల్లో తిరుగుతున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా డ్రామా చేస్తున్నారు. విచారణ చేసేది సిట్టా, పీసీసీనా, బీజేపీనా అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.

News February 2, 2026

నల్లపాడు పీఎస్‌లో నన్ను వేధించారు: అంబటి

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబును పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను నల్లపాడు పీఎస్‌లో టార్చర్ చేశారని అంబటి న్యాయమూర్తికి తెలిపారు. అధికారుల ఒత్తిడితోనే ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ చెప్పారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు.