News September 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 6, 2026

లోక్‌సభ సోమవారానికి వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ

image

లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. నిరసనలు, నినాదాలతోనే 19 గంటల సభా సమయం వృథా అయిందని సభ వాయిదాకు ముందు స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అమెరికా, EU వాణిజ్య ఒప్పందంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచి సభ్యులు ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. బడ్జెట్‌పై శుక్రవారం సాధారణ చర్చ జరగాల్సి ఉంది. ఇక, లిస్ట్ ప్రకారం రాజ్యసభలో చర్చలు కొనసాగుతున్నాయి.

News February 6, 2026

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

image

TG: పార్టీ ఫిరాయింపు MLAల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. MLAల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారని, 3 వారాల సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరారు. 8 మంది MLAల విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మరో ఇద్దరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 3 వారాల్లో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

News February 6, 2026

కలలు కనకపోవడమూ నేరమే: మోదీ

image

బయోగ్రఫీలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ‘ఇతరుల జీవిత కథలు చదివితే స్ఫూర్తి పొందుతాం. ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. పెద్దగా కలలు కనండి. వాటిని సాధించుకోవడానికి బాధ్యతగా పనిచేయండి. టెక్నాలజీని తెలివిగా వాడుకోండి. ముందు తరాలకు లేని ఎన్నో అవకాశాలు నేటి తరానికి టెక్నాలజీ రంగంలో ఉన్నాయి. ఏ కల కనకపోవడమూ నేరమే’ అని పరీక్షా పే చర్చలో చెప్పారు.