News September 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 25, 2025

వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

image

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.

News September 25, 2025

ఒత్తిడి చాలా ప్రమాదకరం: అక్షయ్ కుమార్

image

నేటి ప్రపంచంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలతో ప్రెషర్‌కు గురై జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దని ఓ షోలో చెప్పారు. సాదాసీదాగా జీవితాన్ని గడపాలని సూచించారు. తాను అందరిలాగే సెలవులు తీసుకుంటానని, ఏడాదిలో 125 రోజులు బ్రేక్‌లో ఉంటానని పేర్కొన్నారు. ఆదివారాలు, సమ్మర్ వెకేషన్, దీపావళికి 3 రోజులు సెలవులో ఉంటానని పేర్కొన్నారు. సమయపాలన పాటించడం చాలా ముఖ్యమన్నారు.

News September 25, 2025

ఆసియాకప్‌లో భారత్‌దే హవా

image

ఆసియాకప్‌లో 1984 నుంచి టీమ్ఇండియాదే హవా కొనసాగుతోంది. మొత్తం 17 ఎడిషన్లలో 12 సార్లు <<17820873>>ఫైనల్<<>> చేరింది. ఇప్పటివరకు 8 సార్లు విజేతగా, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇవాళ జరిగే పాక్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విజేతతో ఈ నెల 28న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. అటు ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో భారత ఓపెనర్ అభిషేక్(248), వికెట్ల జాబితాలో బౌలర్ కుల్దీప్(12w) తొలి స్థానాల్లో ఉన్నారు.