News May 3, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 19, 2025
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భాశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. దీనివల్ల గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం జరుగుతుంది. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. దీని ట్రీట్మెంట్ మహిళ వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది. సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News November 19, 2025
USలో ఏపీ మహిళ హత్య.. బిగ్ ట్విస్ట్

APకి చెందిన శశికళ(40), కుమారుడు అనీష్(7) 2017లో USలో హత్యకు గురయ్యారు. భర్తపై అనుమానంతో పోలీసులు అరెస్టుచేసి ఆధారాల్లేక విడిచిపెట్టారు. వారికి హమీద్ అనే సహోద్యోగితో గొడవలున్నాయని గుర్తించగా, అప్పటికే అతను INDకు వచ్చేశాడు. అధికారులు DNA శాంపిల్స్ కోరగా తిరస్కరించాడు. అతను పనిచేసిన Cognizant సాయంతో హమీద్ Laptop నుంచి సేకరించిన DNA హత్యాస్థలంతో సరిపోలింది. దీంతో ఇటీవల హమీద్ను నిందితుడిగా తేల్చారు.
News November 19, 2025
సినిమా అప్డేట్స్

* విక్రమ్ కుమార్ డైరెక్షన్లో నితిన్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తారని సమాచారం. వీరి కాంబోలో వచ్చిన ‘ఇష్క్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
* సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటిస్తారని టాక్. ఇందులో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తారని సమాచారం.
* జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా తర్వాతి షెడ్యూల్ డిసెంబర్లో శ్రీలంకలో జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.


