News October 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 3, 2025

అంబానీ ఆస్తి.. 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం

image

హురూన్ రిచ్ లిస్ట్-2025లో ముకేశ్ అంబానీ రూ.9.55 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ నెట్‌వర్త్ దేశంలోని 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం. ఇండియా ఇన్ పిక్సెల్ డాటా ప్రకారం.. నాలుగు రాష్ట్రాలు మాత్రమే అంతకంటే ఎక్కువ జీడీపీ కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర రూ.24.11 లక్షల కోట్లు, తమిళనాడు రూ.15.71 లక్షల కోట్లు, UP, కర్ణాటక రూ.14.23 లక్షల కోట్ల జీడీపీతో ముందున్నాయి.

News October 3, 2025

దేవరగట్టులో ప్రారంభమైన కర్రల సమరం

image

AP: కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో కర్రల సమరం ప్రారంభమైంది. దసరా సందర్భంగా బన్ని ఉత్సవంలో భాగంగా మాళమ్మ మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్నారు. వాటిని దక్కించుకోవడానికి 3 గ్రామాల భక్తులు ఒకవైపు, 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతున్నారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఉత్సవంలో హింస చెలరేగకుండా 800మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

News October 3, 2025

రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

image

AP: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే నికర జీఎస్టీ వసూళ్లలో 7.45% , స్థూల జీఎస్టీ వసూళ్లలో 4.19% వృద్ధి నమోదైంది. నికర GST కలెక్షన్స్ రూ.2,789 కోట్లకు చేరగా, స్థూల జీఎస్టీ కలెక్షన్స్ రూ.3,653 కోట్లు వచ్చాయి. రాష్ట్ర GST రాబడి 8.28% పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై 3.10% వృద్ధితో రూ.1,380 కోట్ల రాబడి వచ్చింది.