News October 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 8, 2025
కోల్డ్రిఫ్ సిరప్‌కు 20 మంది పిల్లలు బలి!

మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మరణాల సంఖ్య 20కి చేరినట్లు Dy.CM రాజేంద్ర శుక్ల వెల్లడించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రులను ఆయన సందర్శించారు. కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17 మంది ఉన్నారని చెప్పారు. ఫీవర్, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.
News October 8, 2025
సినీ ముచ్చట్లు

* ఫన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటా. చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. ట్విటర్‌లో మొత్తం నెగెటివిటీ ఉంటుంది. అందుకే దూరంగా ఉంటా: ‘మాస్ జాతర’ ఇంటర్వ్యూలో రవితేజ
* ‘జాతిరత్నాలు’ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘ఫంకీ’ మూవీ టీజర్ ఈ నెల 10న విడుదల
* యాక్టర్స్ పేరింగ్‌పై ట్రోల్స్.. రవితేజతో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఉందన్న శ్రీలీల
* OCT 9న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా ట్రైలర్
News October 8, 2025
అక్టోబర్ 8: చరిత్రలో ఈరోజు

1895: రచయిత అడివి బాపిరాజు జననం
1932: సినీ రచయిత శివ శక్తి దత్త జననం
1935: నటుడు మందాడి ప్రభాకర రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1974: సినీ దర్శకుడు బి.ఆర్.పంతులు మరణం
* భారత వైమానిక దళ దినోత్సవం