News October 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 12, 2025
బోలెడు ఆఫర్లతో JIO దీపావళి రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ దీపావళి, ధంతేరాస్ సందర్భంగా రూ.349తో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 28 డేస్ వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు ఉంటాయి. వీటికి అదనంగా 3 నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్(మొబైల్/TV ), ఫ్రీగా 50GB జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజెస్, ఎంటర్‌టైన్మెంట్ సేవలు కలిగిన జియో హోమ్ ఫ్రీ ట్రైల్ 2 నెలలు పొందొచ్చు.
News October 12, 2025
ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.
News October 12, 2025
విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్‌ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్‌ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.