News May 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 17, 2026
APPLY: ప్రతినెలా రూ.3,000 పెన్షన్

చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంక్ వివరాలతో ‘మీసేవ’, CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.
News March 17, 2026
ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

ఇండియాలో గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
News March 17, 2026
ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్లు విడుదల

AP: రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం రూ.45 కోట్లను విడుదల చేసింది. 5వేల మంది ఇమామ్‌లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్ల అకౌంట్లలో రూ.15 కోట్లు జమ చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేసింది.


