News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.

Similar News

News March 25, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✔MBNR: PUలో ఉగాది కవి సమ్మేళనం!
✔BRS హయాంలో రంజాన్ తోఫా ఇచ్చే వాళ్ళం: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
✔NGKL:SLBC ఘటన.. మరొకరు మృతి
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు!
✔GWL:Way2News Effect..అనాథలను రూ.4.15 లక్షలు అందజేత
✔పీయూ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
✔కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
✔కరెంటు కోతలపై వనపర్తిలో రైతుల ధర్నా
✔NGKL:SLBC ఘటన..బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం: కలెక్టర్

News March 25, 2025

BNR: నిర్వాసితులకు అన్ని రకాల మౌలిక వసతులు: R&R కమిషనర్

image

ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన అర్&అర్ కాలనీలలోఅన్ని రకాల మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అర్&అర్ పనులను సమీక్షించారు.

News March 25, 2025

NGKL: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

image

SLBC టన్నెల్‌లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> యూపీలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!