News February 17, 2025
HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.
Similar News
News October 20, 2025
రాజన్న ఆలయ విస్తరణ పనులు పరిశీలించిన పీఠాధిపతి

ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహా స్వామివారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆదివారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. ఆలయ విస్తరణ పనులు, అభివృద్ధి మ్యాప్లు పరిశీలించారు.
News October 20, 2025
దేశంలో యూపీఐ ద్వారానే 85% డిజిటల్ చెల్లింపులు: RBI

ఇండియాలో 85శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.
News October 20, 2025
SRCL: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..!

వరుస లొంగుబాట్లపై నిషేధిత CPI, మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని బహిరంగంగా ఆరోపించింది.