News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.

Similar News

News March 26, 2025

కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

image

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

News March 26, 2025

NTR: అన్న క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్

image

విజయవాడ వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విజయవాడ సింగ్‌నగర్ టిక్కల్ రోడ్డు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన అన్న క్యాంటీన్లో భోజన వసతులను వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

News March 26, 2025

అనకాపల్లి: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

పీఎం ఉపాధి కల్పన పథకం కింద రుణాలు పొందేందుకు అనకాపల్లి జిల్లాలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షంసున్నీషా బేగం  బుధవారం తెలిపారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవారంగానికి రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!