News February 17, 2025
HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.
Similar News
News October 21, 2025
అన్నమయ్య: సెల్యూట్.. సీఐ రుషికేశవ

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం
News October 21, 2025
వరంగల్ నిట్లో ప్రారంభమైన వెల్నెస్ సెంటర్

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నిట్లో వెల్నెస్ సెంటర్ ప్రారంభమైంది. మంగళవారం నిట్ డైరెక్ట ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానం, యోగాభ్యాసం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి పద్ధతులను విద్యార్థులు, అధ్యాపకుల దైనందిన జీవితంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం అన్నారు.
News October 21, 2025
మంథని: ఈనెల 24న రాజకీయ శిక్షణా శిబిరం

ఈనెల 24న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని యాదవ సోదరులు వినియోగించుకోవాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్ కోరారు. మంథనిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల పాత్ర ఉండాలని అఖిల భారత మహాసభ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగానే 24న పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.