News February 17, 2025
HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.
Similar News
News March 18, 2025
టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
News March 18, 2025
NRPT: కొట్టుకున్న మహిళలు.. ఒకరి మృతి

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా జలాల్ పూర్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల మేరకు.. గ్రామ నర్సరీ వద్ద లక్ష్మి, మరో మహిళ బుజ్జమ్మ మధ్య ఓ విషయమై మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బుజ్జమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News March 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.