News February 17, 2025
HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.
Similar News
News March 24, 2025
రాజ్యాంగ మార్పు: DK, రాహుల్‌పై మండిపడ్డ BJP

కాంగ్రెస్ నేత DK శివకుమార్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై BJP మండిపడుతోంది. ‘ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని DK అంగీకరించారు. ఆ పార్టీ రాజ్యాంగానికి పెద్ద ముప్పు. అది అంబేడ్కర్, SC, ST, OBC వ్యతిరేకి’ అని షెజాద్ విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు జాతీయ ప్రయోజనం కన్నా ముస్లిముల బుజ్జగింపే ప్రధానం. రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఎక్కడ’ అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.
News March 24, 2025
వనపర్తి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాలలకు తీరని అన్యాయం’

రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి మాలలకు సంక్షేమ పథకాల్లో, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో తీరని అన్యాయం జరిగిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు అన్నారు. మాలలకు ప్రతి సంక్షేమ పథకంలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు వినతి పత్రం అందించారు. మద్దిలేటి వెంకటేశ్, కురుమూర్తి, కరుణాకర్ పాల్గొన్నారు.
News March 24, 2025
సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.