News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.

Similar News

News February 21, 2026

గురువారం ‘తిరుప్పావడ సేవ’

image

గురువారం స్వామివారికి అన్ని ఆభరణాలు తొలగించి ధోవతి, ఉత్తరీయాలే ఉంచుతారు. ఈరోజు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నామ పరిమాణాన్ని తగ్గించడం వల్ల ఆ దివ్య నేత్రాలను నేరుగా చూడవచ్చు. దీన్నే నేత్ర దర్శనం అంటారు. బంగారు తొట్టిలో భారీగా పులిహోర నివేదిస్తారు. నామం తీసినప్పుడు స్వామివారి శక్తిమంతమైన చూపు నేరుగా భక్తులపై పడకుండా దీనిపై పడేలా చేస్తారు. అందుకే దీనికి పావడ అని పేరొచ్చింది.

News February 21, 2026

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాయనున్నారంటే?

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు మధ్య పరీక్షలు జరగనున్నాయి.

News February 21, 2026

ఎన్నికల ఫలితాలపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

image

తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు పట్టం కట్టడం అనేది ఎప్పుడూ జరిగే ప్రక్రియేనని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలు లేదా పట్టణాల్లో పనులు కావాలి కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక శాతం అధికార పార్టీకే ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు.