News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.

Similar News

News February 25, 2026

తిరుపతి: లవర్‌తో పెళ్లి కోసం కూతురినే చంపేసింది!

image

తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత(19) భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గ(3)తో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది. ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డికుమార్‌తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు ఈనెల 19నుంచి కనబడటం లేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగు చూసింది.

News February 25, 2026

‘UK బాకీ పడింది.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే’.. ఇండియన్ పోరాటం!

image

మధ్యప్రదేశ్‌కు చెందిన 63ఏళ్ల వివేక్ రూఠియా తన తాత బ్రిటిష్ ప్రభుత్వానికి 1917లో ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ‘ఇండియన్ వార్ లోన్’ పేరుతో నిధులు సేకరించగా వివేక్ తాత సేఠ్ జుమ్మా లాల్ ₹35,000 రుణంగా ఇచ్చారు. వడ్డీతో కలిపి ప్రస్తుతం ఆ మొత్తం ₹2కోట్లు ఉంటుందని అంచనా. ఈ సొమ్మును రికవరీ చేసేందుకు యూకే ప్రభుత్వంపై దావా వేయనున్నారు.

News February 25, 2026

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారు పచ్చని పట్టు వస్త్రాలు, విశేష సువర్ణ ఆభరణాలతో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుక్లపక్షం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్ర నామార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా శాంతి పాఠాల ఘోషతో మార్మోగింది. విశేష అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు.