News April 19, 2024

హ్యాపీ బర్త్‌డే అమ్మ!: జగన్

image

ఏపీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిల తమ తల్లి విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే అమ్మ! అని జగన్ ట్వీట్ చేశారు. ‘చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ’ అని షర్మిల పోస్ట్ చేశారు.

Similar News

News February 7, 2026

సడన్‌గా తగ్గిన రష్యా చమురు దిగుమతులు!

image

2025లో భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్‌లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్‌కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్‌గానే ఉంది.

News February 7, 2026

ఒక్క ప్రమాదం.. ముమైత్ జీవితం తలకిందులు!

image

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.

News February 7, 2026

గులాబీ తోటల్లో కనిపించే చీడపీడలు

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.