News August 9, 2024

హ్యాపీ బర్త్‌డే SSMB: మెగాస్టార్ చిరంజీవి

image

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హావ్ ఎ బ్లెస్డ్ ఇయర్’ అంటూ విష్ చేశారు. కాగా ఇప్పటికే పలువురు స్టార్లు మహేశ్‌కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్, 14 రీల్స్, సురేశ్ ప్రొడక్షన్స్ తదితర అగ్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి తదితర ప్రముఖులు విష్ చేసిన వారిలో ఉన్నారు.

Similar News

News March 4, 2026

దివ్యాంగులకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం.. TG ప్రభుత్వం క్లారిటీ

image

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో TGSRTC బస్సుల్లోనూ దివ్యాంగులందరికీ పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని TG ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందని తెలిపింది.

News March 4, 2026

₹17 లక్షల డ్రోన్ కోసం ₹33 కోట్ల మిస్సైల్: ఇరాన్ ‘కాస్ట్ వార్’ వ్యూహం!

image

సుమారు ₹17 లక్షల విలువైన ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా ₹33 కోట్ల విలువైన పేట్రియాట్ మిస్సైళ్లను వాడుతున్నట్లు సమాచారం. ఈ వ్యూహంతో అమెరికా రక్షణ నిల్వలను దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ వంటి దేశాల వద్ద మిస్సైల్ నిల్వలు కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఆయుధాలు ఎవరి దగ్గర ముందుగా అయిపోతాయన్నదే ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించనుంది.

News March 4, 2026

చిరంజీవి కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

image

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరు స్టైలిష్‌గా కనిపిస్తారని, భారీ క్లైమాక్స్ సెటప్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుందని తెలిపాయి. ఇందులో పెద్ద స్టార్లు నటించబోతున్నారని, త్వరలో పూజా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి.