News May 20, 2024
హ్యాపీ బర్త్‌డే తారక్ బావ: అల్లు అర్జున్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి’ అని Xలో పోస్టు చేశారు. అలాగే నిన్న దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్‌ను ఉద్దేశించి.. ‘FEAR is FIRE’ అని రాసుకొచ్చారు.
Similar News
News January 17, 2026
H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.
News January 17, 2026
ఇరిగేషన్, ఎడ్యుకేషనే నాకు తొలి ప్రాధాన్యం: CM రేవంత్

TG: దేశానికి తొలి PM నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యం ఇచ్చారని, తానూ ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే పెద్దపీట వేస్తానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. MBNR(D) చిట్టబోయినపల్లిలో IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంటుందని, ప్రతి విద్యార్థి నిబద్ధతతో చదువుకోవాలని సూచించారు. 25 ఏళ్ల వరకు కష్టపడితే 75 ఏళ్ల వరకు సంతోషంగా జీవించవచ్చన్నారు.
News January 17, 2026
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


