News June 10, 2024

నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు: లోకేశ్

image

పుట్టిన రోజు సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన పెద్దల్లుడు, టీడీపీ నేత నారా లోకేశ్ కూడా బాలయ్యకు విషెస్ తెలిపారు. ‘నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బాలకృష్ణ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అటు రాజకీయ, సినీ ప్రముఖులు బాలయ్యకు విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Similar News

News December 23, 2024

ఈ మోడల్ ఫోన్లలో WhatsApp పని చేయదు!

image

పదేళ్లు దాటిన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ OSతో పని చేసే ఫోన్లలో JAN 1, 2025 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S3, S4 మినీ, నోట్2, మోటో జీ, మోటో రేజర్ HD, మోటో E 2014, LG నెక్సస్ 4, LG G2 మినీ, సోనీ ఎక్స్‌పీరియా Z, SP, V, HTC 1X, 1X+ తదితర మోడల్ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదు. అలాగే ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ మే 5 నుంచి ఇదే నిబంధన వర్తించనుంది.

News December 23, 2024

జియోకు SHOCK ఎయిర్‌టెల్ ROCZZ

image

రిలయన్స్ జియోకు షాకులు తప్పడం లేదు. సెప్టెంబర్లో 79.7 లక్షల యూజర్లను కోల్పోయిన ఆ కంపెనీ అక్టోబర్లో 37.60 లక్షల యూజర్లను చేజార్చుకుంది. రీఛార్జి ధరలు పెంచినప్పటి నుంచీ ఇదే వరుస. వొడాఫోన్ ఐడియా నష్టం 15.5L VS 19.77Lగా ఉంది. SEPలో 14.35 లక్షల యూజర్లను కోల్పోయిన భారతీ ఎయిర్‌టెల్ OCTలో 19.28 లక్షల మందిని యాడ్ చేసుకుంది. BSNL యూజర్లు 5 లక్షలు పెరిగారు. సెప్టెంబర్లోని 8.5Lతో పోలిస్తే కొంత తక్కువే.

News December 23, 2024

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు జైశంక‌ర్‌

image

విదేశాంగ మంత్రి జైశ‌ంకర్ మంగ‌ళ‌వారం అమెరికా ప‌ర్య‌ట‌నకు బ‌య‌లుదేర‌నున్నారు. Dec 29 వ‌ర‌కు ఆగ్ర‌రాజ్యంలో ప‌ర్య‌టిస్తారు. ద్వైపాక్షిక‌, ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పై ఆ దేశ విదేశాంగ ప్రతినిధులతో చ‌ర్చిస్తారు. అలాగే భారత కాన్సుల్ జనరల్ సదస్సులో పాల్గొంటారు. మ‌రికొన్ని రోజుల్లో బైడెన్ ప‌ద‌వీకాలం ముగుస్తుండడం, ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న త‌రుణంలో జైశంక‌ర్ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్పడింది.