News December 31, 2025

Happy New Year

image

భారతదేశం మరో 8.30గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్టమస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లిపోయింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు నూతన సంవత్సరం ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్‌లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లోనూ న్యూ ఇయర్ మొదలవనుంది.

Similar News

News January 1, 2026

సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

image

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News January 1, 2026

అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ: SIT

image

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ అంచనా కంటే ఎక్కువే అని కొల్లాం కోర్టుకు SIT తెలిపింది. సన్నిధానం తలుపులకు గల ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5KGల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చాడని పేర్కొంది. చెన్నైలో కెమికల్స్‌తో బంగారం కరిగించారని తెలిపింది.

News January 1, 2026

శిక్ష పూర్తయినా వదలని పాక్.. జైళ్లలోనే 167 మంది భారతీయులు!

image

భారత్-పాక్ మధ్య ఏటా జరిగే ఖైదీల జాబితా మార్పిడి ప్రక్రియ 2026 నూతన సంవత్సరం తొలి రోజైన గురువారం పూర్తయింది. ఆ దేశ జైళ్లలో శిక్షాకాలం పూర్తయినప్పటికీ ఇంకా 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలు అక్కడే మగ్గుతున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వీరిని వెంటనే విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం పాక్ కస్టడీలో మొత్తం 257 మంది ఉండగా.. భారత జైళ్లలో 424 మంది పాకిస్థానీలు ఉన్నారు.