News December 2, 2024

బుమ్రాను ఎదుర్కోలేనందుకు సంతోషంగా ఉంది: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

image

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ అనూహ్యంగా పుంజుకొని గెలిచిన విషయం తెలిసిందే. 8 వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించిన బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టీవెన్ ఫిన్ ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా బౌలింగ్ గమనించండి. మనం బ్యాటింగ్‌కి దిగి అతడిని ఎదుర్కొనే అవకాశం లేనందుకు సంతోషంగా ఉన్నామని మీకు అనిపిస్తుంది. బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్. అతడి ఆట చూసేందుకు ఎంతో ఇష్టపడతా’ అని ఫిన్ అన్నారు.

Similar News

News March 23, 2026

ఇవాళ ‘వాహన్’ పోర్టల్‌లోకి TG ఎంట్రీ

image

TG: కేంద్ర పరిధిలోని ‘వాహన్’ పోర్టల్‌తో రాష్ట్ర వాహనాల డేటా ఇవాళ అనుసంధానం కానుంది. ఈ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనర్ అడ్రస్, పేరు మార్పు, RC డూప్లికేట్, పన్ను చెల్లింపు వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌కు మారనున్నాయి. RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒకే పేరుపై <<19443159>>రెండో వాహనం<<>> కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్‌ నేటి నుంచి రద్దవనుంది.

News March 23, 2026

షాకింగ్.. మాజీ ఎమ్మెల్యేపై కుల బహిష్కరణ

image

21వ శతాబ్దంలోనూ కుల జాడ్యం కొనసాగుతోంది. ఇందుకు సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులూ బలవుతున్నారు. తాజాగా ఒడిశాలో వేరే సామాజికవర్గం యువకుడితో కూతురి నిశ్చితార్థం చేసిన నవరంగపూర్ EX MLA సదాశివ ప్రధాన్ కుల బహిష్కరణకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని 12ఏళ్లపాటు వెలివేస్తున్నట్లు ఆల్ ఇండియా భత్రా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకటించింది. సామాజిక, సాంస్కృతిక, ఇతర ఫ్యామిలీ వేడుకల్లో ఎవరూ పాల్గొనవద్దని ఆదేశించింది.

News March 23, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

image

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.