News March 23, 2025
RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

IPL2025 తొలి మ్యాచులో KKRపై విజయం సాధించిన RCBకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా X వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఎట్టకేలకు ఆర్సీబీ బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన మాల్యా ప్రస్తుతం UKలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 24, 2025
రాష్ట్రంలో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

TG: రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. NZB, కామారెడ్డి, ఆసిఫాబాద్, KNR, WGL, MDK, VKD, సంగారెడ్డి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.
News March 24, 2025
నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్: ప్రశాంత్ కిశోర్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. క్షీణిస్తున్న మానసిక, శారీరక ఆరోగ్యం కారణంగా ఆయన ఇకపై పాలించడానికి తగినవారు కాదని అన్నారు. ‘నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్. ఎవరికైనా డౌట్ ఉంటే మంత్రుల పేర్లు చెప్పమని అడగండి. ఆయన పరిస్థితి గురించి ప్రధాని మోదీ, అమిత్ షాకు తెలియదంటే నమ్మలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు.
News March 24, 2025
IPL: ముంబైకి ఇదేం కొత్త కాదు

IPLలో ముంబై ఇండియన్స్ ఓ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా CSKతో మ్యాచులోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా 13 ఓపెనింగ్ మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. అయితే 2013 నుంచి 5 సార్లు ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం.