News April 13, 2024

KTRతో పని చేయడం సంతోషంగా ఉంది: RSP

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆ పార్టీ నేత ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. బురదజల్లడమే పనిగా పెట్టుకునే నేతలున్న నేటి రాజకీయాల్లో లాజిక్స్ మాట్లాడుతూ.. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే కేటీఆర్ వంటి లీడర్ దొరకడం చాలా అరుదు అని ప్రవీణ్ కుమార్ అన్నారు. చర్చలో తన వాదనను వినిపించడంలో కేటీఆర్ తీరు అమోఘం అన్నారు. టీవీ9లో ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్న నేపథ్యంలో RSP ఇలా స్పందించారు.

Similar News

News March 23, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కారణాలివే!

image

తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రేటు రూ.370-400కు చేరింది. వాతావరణంలో అనూహ్య మార్పుల (ఎండలు+వర్షాలు) వల్ల పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి సగటున 3 కేజీల వరకు పెరిగేదని, ప్రస్తుతం కిలోన్నర మాత్రమే ఉంటోందని పేర్కొంటున్నారు. ఉత్పత్తి పడిపోవడం, వరుస పెళ్లిళ్లు, గ్రామాల్లో ఉత్సవాల కారణంగా డిమాండ్ పెరగడం వల్ల రేటు అధికమైందంటున్నారు.

News March 23, 2026

ఈ నెల 28 వరకు వర్షాలు!

image

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ జల్లులు పడతాయని అంచనా వేసింది.

News March 23, 2026

ఘోరం: ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది మృతి

image

సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) మధ్య ఆధిపత్య పోరు సామాన్యుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా ఈద్ రోజున RSF ఆధీనంలో ఉన్న ఓ నగరంలోని ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది పిల్లలు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నట్లు WHO వెల్లడించింది. మరో 89 మంది గాయపడినట్లు తెలిపింది. ఈ దాడిని ఆర్మీ చేసినట్లు RSF ఆరోపిస్తుండగా తమకు సంబంధం లేదని సైనికులు ప్రకటించారు.