News July 11, 2024

కేంద్రమంత్రి ప్రకటన సంతోషాన్నిచ్చింది: లోకేశ్

image

AP: కేంద్ర ఉక్కుశాఖ మంత్రి <<13607142>>కుమారస్వామి<<>>కి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ ఆయన చేసిన ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. AP ప్రజల మనోభావాలను కుమారస్వామి నిలబెట్టారన్నారు. కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. YCP తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల అంచనాలను అందుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ చేశారు.

Similar News

News January 19, 2025

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. తన కొడుకును ఉరి తీయాలన్న తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చడంపై అతని తల్లి మాలతి(70) స్పందించారు. తన కొడుకు చేసిన తప్పును మహిళగా క్షమించబోనని స్పష్టం చేశారు. తనకూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలి తల్లి బాధను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా అభ్యంతరం లేదన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని సంజయ్ సోదరి కూడా తేల్చిచెప్పారు.

News January 19, 2025

సైఫ్, కరీనా నవ్వుతున్న AI ఫొటో.. ఎంపీపై విమర్శలు

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి దురదృష్టకరమని నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆయన త్వరగా కోలుకుంటున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ బెడ్‌పై, కరీనా పక్కనే కూర్చుని నవ్వుతున్నట్లు ఉన్న AI జనరేటెడ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి ఫొటోలు పంచుకోవడం అవసరమా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.

News January 19, 2025

సైఫ్ నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీ

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడికి బాంద్రా కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇవాళ తెల్లవారుజామున అతడిని థానేలో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాడికి గల ప్రధాన కారణాలపై నిందితుడిని పోలీసులు ప్రశ్నించనున్నారు.