News August 29, 2024
వేధింపుల కేసు.. HYDకు రానున్న నటి జెత్వానీ

ముంబై నటి జెత్వానీ ఈరోజు రాత్రి HYDకు రానున్నారు. అక్కడి నుంచి ఏపీ పోలీసులు రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకెళ్లే అవకాశం ఉంది. <<13967814>>వేధింపుల<<>> కేసుకు సంబంధించి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె తరఫు న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసు విచారణాధికారిగా ప్రభుత్వం ఏసీపీ స్రవంతి రాయ్ను నియమించింది.
Similar News
News October 25, 2025
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి CBN శ్రీకారం

AP: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ను CM CBN దుబాయ్లో ప్రారంభించారు. ‘ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఇది ప్రయోజనం అందిస్తుంది. బీమా వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా ₹10 లక్షలు అందుతుంది. ఈ పథకంలో నమోదు కావడానికి ‘https://apnrts.ap.gov.in/insurance’ వెబ్ సైట్ను సందర్శించాలి’ అని I&PR సూచించింది.
News October 25, 2025
HATS OFF: ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాడు

AUSతో వన్డే సిరీస్లో అదరగొట్టిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ విమర్శకుల నోళ్లు మూయించారు. ఫామ్ లేమితో జట్టు నుంచి తప్పుకున్న చోటే సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో AUSతో టెస్టు సిరీస్లో విఫలమైన రోహిత్ కెప్టెన్ అయినప్పటికీ టీమ్ కోసం సిడ్నీ మ్యాచ్ నుంచి వైదొలిగారు. ఇవాళ అదే సిడ్నీలో సూపర్ సెంచరీ(121*)తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. ఎక్కడ తగ్గారో అక్కడే నెగ్గి చూపించారు.
News October 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 46 సమాధానాలు

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరు ‘సంపాతి’.
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ‘మందరం’.
3. నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది.
4. ఇంద్రుడి గురువు ‘బృహస్పతి’.
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ‘కుబేరుడు’.
<<-se>>#Ithihasaluquiz<<>>


