News March 31, 2025

SRHకు వేధింపులు.. సీఎం ఆగ్రహం

image

TG: పాసుల కోసం SRH యాజమాన్యాన్ని HCA <<15934651>>వేధింపులకు<<>> గురిచేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివరాలను సేకరించిన ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

Similar News

News January 22, 2026

అభిషేక్ రికార్డు

image

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్‌వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.

News January 22, 2026

మేడారం వెళ్తున్నారా?.. Hi అని వాట్సాప్ చేస్తే

image

TG: మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన భాషను ఎంచుకొని జాతర సమాచారం, ట్రాఫిక్&రవాణా అప్‌డేట్స్, వాతావరణ సమాచారం, అత్యవసర సహాయం వంటి వివరాలు పొందవచ్చు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది.

News January 22, 2026

డ్రాగన్ ఫ్రూట్ కాపు వేగంగా రావాలంటే..

image

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నర్సరీల్లో మొక్కే అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ మధ్యే పంట కట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క నుంచి.. 3-4 అడుగుల కొమ్మను తీసుకొని నవంబర్, డిసెంబర్‌లో నాటాలి. ఇలా చేస్తే మొక్క నాటిన 6 నెలల్లోనే పూత, కాయలు వచ్చి, మంచి యాజమాన్యం పాటిస్తే వచ్చే డిసెంబర్ నాటికి కనీసం 2 టన్నుల దిగుబడి వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు, అధిక దిగుబడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.