News April 29, 2024

పార్టీ మారిన వారికి గడ్డుకాలం!

image

ఎన్నికల ముంగిట పార్టీలు మారిన అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. వాళ్లు మొన్నటి వరకూ విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నలు సంధించిన పార్టీలోనే ఇప్పుడు చేరారు. దీంతో గతంలో వారు వేసిన ప్రశ్నలకు సమాధానం దొరికిందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాత వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు పోస్టు చేస్తూ.. సెటైర్లు వేస్తున్నారు. పార్టీ మారక ముందు అలా.. మారిన తర్వాత ఇలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Similar News

News December 1, 2025

చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

image

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్‌గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.

News December 1, 2025

హసీనాపై మరో కేసు! భారత్‌పైనా ఆరోపణలు

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18408910>>షేక్ హసీనా<<>>పై మరో కేసు పెట్టేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనా కారణమని చెబుతోంది. ఆ హింసాకాండలో భారత్ ప్రమేయం కూడా ఉందని అక్కడి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో పేర్కొంది. బంగ్లా ఆర్మీని బలహీనపరిచేందుకు ఆ హింసకు భారత్ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తోంది. 2009 హింసాకాండలో సీనియర్ ఆర్మీ అధికారులు సహా 74 మంది మరణించారు.

News December 1, 2025

POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

image

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్‌ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.