News November 11, 2024
వేలంలో వాళ్లిద్దర్నీ కొనడం చాలా కష్టం: CSK
IPL వేలంలో పంత్, KL రాహుల్‌పై దృష్టి సారిస్తామని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా తెలిపారు. ‘మాకున్న పర్సును బట్టి ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి వారిని కొనడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాం. భారత ప్లేయర్లకు చాలా డిమాండ్ ఉంది’ అని పేర్కొన్నారు. CSKకి ప్రస్తుతం ధోనీ కీపింగ్ చేస్తుండగా, రుతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నారు. పంత్ లేదా రాహుల్‌ను కొంటే ఆ రెండు బాధ్యతల్నీ ఒకరే నిర్వర్తించే అవకాశం ఉంది.
Similar News
News November 13, 2024
బుల్డోజర్ యాక్షన్: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్
బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజంగానే నేరనిరూపణ జరిగినా ఇళ్లను కూల్చకూడదని, అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతారని గుర్తుచేసింది.
News November 13, 2024
పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్
TG: పోలీసుల అదుపులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందొద్దని, ధైర్యంగా పోరాడాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత నరేందర్ భార్య శ్రుతితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కాగా లగచర్ల ఘటన ప్రధాన నిందితుడు సురేశ్ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News November 13, 2024
శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు
AP: నటి శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు.