News April 30, 2024
హార్దిక్.. మరో‘సారీ’.. T20WC కోసం ఎంపిక కరెక్టేనా?

ఈ IPL సీజన్‌లో MI కెప్టెన్ హార్దిక్ పాండ్య వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ LSGతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగారు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లలో 197 రన్స్ చేసి, 4 వికెట్లు మాత్రమే తీశారు. ఫామ్‌లో లేని పాండ్యను T20WCకి ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. IPLలో అదరగొడుతోన్న అభిషేక్, పరాగ్, రుతురాజ్, తిలక్, నటరాజ్, శశాంక్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?
Similar News
News February 1, 2026
Budget 2026: ఏ రంగానికి ఎంతంటే..

కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. కీలక రంగాలకు కేటాయింపులు ఇలా (కోట్లలో)…* ట్రాన్స్‌పోర్ట్ – ₹5,98,520 * రక్షణ రంగం – ₹5,94,585 * గ్రామీణాభివృద్ధి – ₹2,73,108 * హోంశాఖ – ₹2,55,234 * వ్యవసాయం – ₹1,62,671 * విద్య – ₹1,39,289 * వైద్యారోగ్యం – ₹1,04,599 * పట్టణాభివృద్ధి – ₹85,522 * IT, టెలికం – ₹74,560 * వాణిజ్యం, పరిశ్రమలు – ₹70,296
News February 1, 2026
ఏపీ సహా 4 రాష్ట్రాలతో మైనింగ్ మిషన్

ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో స్పెషల్ మైనింగ్ మిషన్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రపంచ స్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని పేర్కొన్నారు. కాగా రేర్ ఎర్త్ మినరల్స్ జాబితాలో మోనాజైట్, జెనోటైమ్, బాస్ట్‌నేసైట్, లోపరైట్ ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ రంగానికి కీలకం.
News February 1, 2026
నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్

TG: కాసేపట్లో సిట్ విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ గదిని పరిశీలించారు. ఇంటి చుట్టూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.


