News November 20, 2024
నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచారు. 244 పాయింట్లతో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టాప్-5లో దీపేంద్ర, లివింగ్‌స్టోన్, స్టొయినిస్, హసరంగ ఉన్నారు. మరోవైపు టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవి బిష్ణోయ్ (8), అర్ష్‌దీప్ (9) టాప్-10లో కొనసాగుతున్నారు. అగ్ర స్థానంలో ఆదిల్ రషీద్ ఉన్నారు.
Similar News
News December 5, 2025
కోతులను పట్టిస్తేనే.. సర్పంచ్‌గా గెలిపిస్తాం: మాదారం గ్రామస్థులు

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలోని మాదారం గ్రామ ప్రజలు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారి, పంటలను నాశనం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కోతుల సమస్యను పరిష్కరించే అభ్యర్థినే తాము గెలిపిస్తామని గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు స్పష్టం చేశారు.
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.


