News July 18, 2024
కెప్టెన్సీకి సూర్య కంటే హార్దిక్ బెటర్ ఆప్షన్?

టీమ్‌ఇండియా T20 <<13642798>>కెప్టెన్సీకి<<>> సూర్య కంటే హార్దిక్ పాండ్యనే బెటర్ ఆప్షన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్‌కు కెప్టెన్సీ అనుభవం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అతడి నాయకత్వంలో IND 16 T20లు ఆడగా పదింట్లో గెలిచింది. IPLలోనూ GT, MIని పాండ్య లీడ్ చేశారు. ఇక సూర్య INDకి 7 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి ఐదింట్లో గెలిచారు. అయితే హార్దిక్‌కు ఫిట్‌నెస్ సమస్యలు మైనస్ అని మరికొందరు అంటున్నారు.
Similar News
News December 6, 2025
పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్‌కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.
News December 6, 2025
వ్యూహ లక్ష్మి అచ్చును భక్తులందరూ చూడగలరా?

తిరుమలలో వ్యూహ లక్ష్మి దర్శన భాగ్యం అందరికీ దక్కదు. శ్రీవారిని గురు, శుక్ర వారాల్లో దర్శనం చేసుకునేవారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. గురువారం నాడు శ్రీవారి ఆభరణాలు తొలగిస్తారు. అప్పుడు అమ్మవారిని నేరుగా చూడవచ్చు. మొదటి గడప దర్శనం అవకాశం దొరికిన వారికి వ్యూహలక్ష్మి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజున అభిషేకం, నిజపాద దర్శనంలో అమ్మవారి పసుపు ముద్రను దర్శించుకోవచ్చు.
News December 6, 2025
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


