News July 18, 2024
విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్య

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య-నటాషా తాము విడిపోయినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ‘మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. అగస్త్యకు(కుమారుడు) మంచి కో-పేరెంట్స్గా ఉంటాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను మీరు గౌరవిస్తూ, మద్దతివ్వాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. వీరు 2020 మే 31న వివాహం చేసుకున్నారు.
Similar News
News November 27, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో సమావేశం అయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు రెండేళ్ల కింద నోటికి ఏదీ వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం కనబడకుండా పోయారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనబడని పరిస్థితి ఉందన్నారు.
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


