News January 3, 2025
టీమ్ ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య?

BGT ఐదో టెస్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ త్వరలోనే టెస్టులతో పాటు వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను నియమిస్తారని క్రీడావర్గాలు విశ్లేషిస్తున్నాయి. 3 ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించాలని BCCI భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టులకు బుమ్రా/కోహ్లీ, T20లకు సూర్య, ODIలకు హార్దిక్ ఉండొచ్చు.
Similar News
News December 31, 2025
అమ్మాయిలూ.. కడుపునొప్పి వస్తోందా?

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫెలోపియన్ ట్యూబ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అండాశయం నుంచి అండాలను గర్భాశయానికి పంపించడంలో ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటిలో అడ్డంకులు ఏర్పడినపుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీన్ని హైడ్రోసాల్పిన్క్స్ అంటారు. మూత్ర విసర్జన సమయంలో మంట, ఋతుస్రావం సమయంలో నొప్పి ఇవన్నీ హైడ్రోసాల్పింక్స్ లక్షణాలు. కొన్నిసార్లు ఇది సంతానలేమికి దారి తీయొచ్చంటున్నారు నిపుణులు.
News December 31, 2025
హైడ్రోసాల్పిన్స్క్‌కి కారణాలు

క్లామిడియా, గోనేరియా మొదలైన కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు (STDలు) హైడ్రోసాల్పిన్క్స్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. అలాగే క్షయ వ్యాధి, గతంలో ఫెలోపియన్ ట్యూబ్‌ల శస్త్రచికిత్స, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స తీసుకున్నా ఈ సమస్య రావొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి ప్రెగ్నెన్సీ కోసం IVF సిఫార్సు చేస్తారు. హైడ్రోసాల్పిన్క్స్‌ను అల్ట్రాసౌండ్, ఇతర ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేస్తారు.
News December 31, 2025
ఇతిహాసాలు క్విజ్ – 113 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన, బాణం వేసిన బోయవాడు ఎవరు? ఆయన పూర్వజన్మలో ఎవరు?
సమాధానం: త్రేతాయుగంలో రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపాడు కదా! ఆ వాలియే ద్వాపర యుగంలో ‘జరుడు’ అనే బోయవాడిగా జన్మించాడు. రాముడు వాలికి ఇచ్చిన మాట ప్రకారం.. ఈ జన్మలో కృష్ణుడిగా ఉన్న తనను చంపే అవకాశాన్ని వాలికి(జరుడికి) కల్పించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


