News November 24, 2024
రికార్డు సృష్టించిన హార్దిక్ పాండ్య

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఘనత సాధించారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ఈ బరోడా ప్లేయర్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74* పరుగులు చేశారు. హార్దిక్ దూకుడుతో బరోడా 185 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది.
Similar News
News January 1, 2026
ఫ్రాన్స్‌లోనూ టీనేజర్లకు SM బ్యాన్?

15 ఏళ్ల లోపు పిల్లలకు SM వినియోగాన్ని నిషేధించాలని ఫ్రాన్స్ యోచిస్తోంది. ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయగా, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు చదువుతున్న స్కూళ్లలో ఫోన్ వాడటంపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. త్వరలో ఉన్నత పాఠశాలల్లోనూ నిషేధించనుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు SM వినియోగాన్ని నిషేధించిన తొలిదేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. తర్వాత మలేషియా కూడా ఇదే <<18381200>>నిర్ణయం<<>> తీసుకుంది.
News January 1, 2026
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!

TG: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఇల్యూషన్ పబ్‌లో డీజే ఆర్టిస్ట్‌కు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. ఐదు గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు.
News January 1, 2026
అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.


