News May 26, 2024

జట్టుతో అమెరికా వెళ్లని హార్దిక్ పాండ్య

image

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయల్దేరిన భారత జట్టు సభ్యుల్లో హార్దిక్ పాండ్య లేరు. భార్యతో విడాకుల రూమర్ల నేపథ్యంలో హార్దిక్ జట్టుతో వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న పాండ్య అక్కడి నుంచే నేరుగా అమెరికా వెళ్లి జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అటు వీసా ఆలస్యం కారణంగా విరాట్ కోహ్లీ కూడా అమెరికా వెళ్లలేదు.

Similar News

News December 31, 2025

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

image

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్‌(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్‌లోనూ అన్వేష్‌పై <<18701726>>ఫిర్యాదు<<>> చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

News December 31, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 పతనమై రూ.1,24,550 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 31, 2025

అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

image

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.