News January 29, 2025

హార్దిక్ వల్ల ఇతరులపై ఒత్తిడి పడింది: పార్థివ్ పటేల్

image

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆటతీరుపై (35 బంతుల్లో 40)భారత మాజీ కీపర్ పార్థివ్ పటేల్ విమర్శలు గుప్పించారు. ‘హార్దిక్ తన ఆటతో ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని పెంచారు. చాలా బంతులు డాట్స్ ఆడారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేసి ఉన్నా బాగుండేది. టీ20 మ్యాచ్‌లో క్రీజులో కుదురుకునేందుకు 20 బంతులు తీసుకోవడం దారుణం’ అని అన్నారు. కాగా.. సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ ఈ నెల 31న జరగనుంది.

Similar News

News January 29, 2026

చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు!

image

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్నాడో వ్యక్తి. బాబుభాయ్(60) ఇంట్లో కూర్చొని ఉండగా చిరుతపులి దాడి చేసింది. అక్కడే ఉన్న శార్దూల్‌(27) అరవడంతో అతడిపైకి దూకింది. దీంతో కొడుకును కాపాడుకునేందుకు బాబుభాయ్ కొడవలి, ఈటెతో చిరుతను కొట్టి చంపేశాడు. తర్వాత అటవీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News January 29, 2026

రాత్రి నానబెట్టి ఉదయం తింటే..

image

రోజువారీ ఆహారంలో పెసలు తప్పకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండే పెసలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
*పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.
*చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది.
*గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.
**రాత్రి నానబెట్టి ఉదయం మొలకల రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

News January 29, 2026

SC స్కాలర్షిప్‌లకు ఆదాయ పరిమితిని పెంచనున్న కేంద్రం

image

SC విద్యార్థుల స్కాలర్షిప్‌ల మంజూరులో పేరెంట్స్ గరిష్ఠ ఆదాయ పరిమితిని ₹2.5 లక్షల నుంచి ₹4.5 లక్షలకు కేంద్రం పెంచనుంది. దీనిపై నోట్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్సులను బట్టి హాస్టలర్స్‌కు రూ.4,000-13,500, డేస్కాలర్స్‌కు రూ.2,000-7,500 వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ సూచనల తర్వాత క్యాబినెట్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీకి నోట్‌ను అందిస్తారు.