News April 28, 2024
తెలుగు ప్లేయర్‌పై హార్దిక్ తీవ్ర వ్యాఖ్యలు

నిన్న ఢిల్లీ చేతిలో ముంబై ఓటమికి చాలా కారణాలున్నా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మే కారణమని ముంబై కెప్టెన్ పాండ్య అనడం చర్చనీయాంశంగా మారింది. ‘8వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌కు వచ్చారు. ఎడమ చేతి బ్యాట్స్‌మన్ అయిన తిలక్ ఆ ఓవర్లో దూకుడుగా ఆడాల్సింది. కానీ తొలి 4బంతులకు సింగిల్స్ తీశారు. అక్కడే మ్యాచ్ పోయింది’ అని పేర్కొన్నారు. హార్దిక్ ఇలా తిలక్ పేరును కారణంగా చూపడంపై నెట్టింట విస్తృత చర్చ నడుస్తోంది.
Similar News
News December 11, 2025
ఆజన్మబ్రహ్మచారి ఆంజనేయుడు!

ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారిగా ప్రసిద్ధి. అయితే హనుమంతుడు కూడా వివాహం చేసుకున్నట్లు కొందరు పండితులు చెబుతున్నారు. అయినా కూడా ఆంజనేయుడు బ్రహ్మచారేనని అంటారు. ఈ వైరుధ్యాలు ఏంటి? హనుమంతుడికి వివాహమైతే బ్రహ్మచారిగానే ఎందుకు పిలవబడుతున్నట్లు? ఈరోజు అనగనగాలో..
<<-se>>#anaganaga<<>>
News December 11, 2025
సర్పంచ్‌గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RRకాలనీ సర్పంచ్‌గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మరణించడంతో గ్రామస్థులు ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేద్దామన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
News December 11, 2025
చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్‌లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.


