News April 11, 2025

శరవేగంగా ‘హరి హర వీరమల్లు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్!

image

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న ‘హరిహరవీరమల్లు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రీరికార్డింగ్, డబ్బింగ్, VFX పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్గెస్ట్ సినిమాటిక్ అద్భుతాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Similar News

News November 19, 2025

కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

image

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

News November 19, 2025

కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

image

శబరిమల యాత్రలో పేరూర్‌తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>

News November 19, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<>IBD<<>>) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. నెలకు రూ.90వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/