News August 16, 2024

‘హరిహరవీరమల్లు’ షూటింగ్ పునః ప్రారంభం

image

కొన్ని నెలలుగా ఆగిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఈ నెల 14 నుంచి పునః ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. స్టంట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో 400-500 మంది ఫైటర్స్‌, జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటారని, ఎప్పుడూ చూడని కొత్త గెటప్‌లో అలరిస్తారని పేర్కొన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 9, 2025

రేషన్ కార్డులపై ఏమిటీ గందరగోళం?

image

TG: ప్రజాపాలన, సర్వేలో వినతుల మేరకు కొత్త రేషన్ కార్డులిస్తామని ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ మీసేవలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇంతలో EC దీనికి బ్రేక్ వేసిందని వార్తలొచ్చాయి. మరోవైపు మీసేవలో అప్లై చేసుకోవడానికి వీలులేదని సర్కార్ చెప్పింది. ఇక కార్డుల జారీకి తాము బ్రేక్ వేయలేదని EC తెలిపింది. వీటన్నింటితో ‘ఇక కార్డులు వచ్చినట్టే’ అని ప్రజలు నిట్టూరుస్తున్నారు.

News February 9, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5L మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు ₹లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

News February 9, 2025

అత్యాశ.. ఉన్నదీ పోయింది!

image

కేంద్రంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలన్న అత్యాశే ఆప్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు అధికారం ఇవ్వడం, ఆ తర్వాత పంజాబ్‌లోనూ పాగా వేయడంతో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ భావించారు. ‘ఇండియా’ కూటమి నుంచి దూరమై నేరుగా మోదీపైనే విమర్శలు చేస్తూ దేశప్రజల దృష్టిని ఆకర్షించాలని చూశారు. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణల కేసులు, ఢిల్లీలో పాలన గాడి తప్పడంతో ప్రజలు ఓటుతో ఊడ్చేశారు.

error: Content is protected !!