News March 3, 2025

CM రేవంత్‌కు హరీశ్ సవాల్

image

TG: బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని ఆరోపించిన సీఎం రేవంత్‌పై హరీశ్ రావు మండిపడ్డారు. పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తానని, లేదంటే ఆయన రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని విషయాలను ఎండగడతామన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత టన్నెల్‌ పనులకు BRS ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, విద్యుత్తు బకాయిలు చెల్లించలేదని సీఎం విమర్శించిన విషయం తెలిసిందే.

Similar News

News March 3, 2025

UAEలో భారత మహిళకు మరణ శిక్ష అమలు

image

షెహజాదీ అనే భారత మహిళకు UAEలో ఈ నెల 15న మరణ శిక్ష అమలైంది. UPకి చెందిన ఆమెను విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించిన ఓ బ్రోకర్ ఓ ముస్లిం జంటకు అమ్మేశాడు. వారు ఆమెను తమతో UAE తీసుకెళ్లి తమ బిడ్డ ఆలనాపాలనల్ని అప్పగించారు. ఆ బిడ్డ హఠాత్తుగా చనిపోవడంతో షెహజాదీపై హత్యారోపణలు మోపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆమె వాదించినా ఆలకించని కోర్టు మరణ శిక్ష విధించింది.

News March 3, 2025

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు..

image

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు మ.2.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. CT చరిత్రలో ఈ 2 పెద్ద జట్లు నాలుగు సార్లు తలపడగా రెండుసార్లు IND, ఒకసారి AUS గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఇరు జట్లూ హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత్ ఆసీస్‌పై గెలిచి 2023 WC ఫైనల్‌లో ఓటమికి రివేంజ్ తీసుకోవాలని చూస్తోంది.
ALL THE BEST TEAM INDIA.

News March 3, 2025

ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయిన పంత్

image

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ ‘లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2022లో పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. 14 నెలల తర్వాత పునరాగమనం చేశారు. పంత్ తిరిగి కోలుకున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో నామినేట్ చేశారు. ఏప్రిల్ 21న విజేతలను ప్రకటించి అవార్డును అందజేయనున్నారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.

error: Content is protected !!